మున్సిపల్ విజయంతో 2020ని శుభారంభం చేస్తాం

మున్సిపల్ విజయంతో 2020ని శుభారంభం చేస్తాం


హైదరాబాద్, జనవరి1 మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. 2020ని శుభారంభం కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని ఆయన వెల్లడించారు. 2019 తమకు బ్రహ్మాండమైన ఆరంభాన్ని ఇచ్చిందని, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో 2020ని ప్రారంభిస్తామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఈనెల మొదటివారంలోనే కెసిఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ, దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ క్యాడర్ మధ్యనే తీవ్ర పోటీ ఉ 0దని, ఇండి పెండెంట్లుగా బరిలో ఉండొద్దని బ్రతిమాలుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని కేటీఆర్ అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్సేనని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ కు ఎంతో చరిత్ర ఉందని, ఎన్నో ఒడిదొడుకులు చూసిందన్నారు. కాంగ్రెస్ ను తీసిపారేయడానికి లేదని, ఒకటి, రెండు అసెంబ్లీలకు విజయాలు రాగానే తాము ఎగిరిపడటం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదని వాళ్లకూ తెలుసన్నారు. తాను చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉందని తెలిపారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి ఉత్తమ్ తప్పుకోవడమనేది వాళ్ల పార్టీ వ్యవహారమని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే కాంగ్రెస్ ర్యాలీని అనుమతి ఇవ్వలేదని, పోలీసు అధికారిపై గవర్నరు కాంగ్రెస్ ఫిర్యాదు సరికాదని కేటీఆర్ సూచించారు. కొత్త దశకంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగు తుందన్నారు. 2020-30 దశకం టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రానిదే నన్నారు. ఇదే సందర్భంలో సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆరే తమ సీఎం అని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ స్పష్టత ఇచ్చాక అనుమానమెందుకని ప్రశ్నించారు. ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుందని, అయితే ఎనికలో కలసి పోటీ చేయమని తెలిపారు ఎన్నికల్లో కలసి పోటీ చేయమని తెలిపారు. నిజామాబాద్ సభలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నంత మాత్రాన.. హిందువులు వ్యతిరేకం కారని చెప్పారు. కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఉన్నాడా అని మరోసారి ప్రశ్నించారు. మస్లిం పదాన్ని చేర్చితే సీఏఏకు అనుకూలంగా ఓటేసామని చెప్పామని మీడియాతో మంత్రి కెటిఆర్ వెలడి గతంలో అనేకసార్లు మద్దతునిచ్చామని గుర్తుచేశారు. తకు శాశ్వత శత్రువులు.. రాజకీయ శత్రువులు లేరని తేల్చిచెప్పారు. ఎంఎంటీఎస్ నేతృత్వంలోని ఫేజ్ 2 పనులను త్వరలో ప్రారంభి స్తామని తెలిపారు. ఓల్డ్ సిటీలో మెట్రో కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ను పట్టించుకోవటం లేదనేది సరైంది కాదన్నారు. అనుమానమెందుకని ఏపీ సీఎం జగతో మంచి సంబంధాలు కొనసాగు తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉన్నాం కాబట్టే కాళేశ్వరం పూర్తయ్యింని చెప్పారు. గోదావరి, కృష్ణాపై ఉ మ్మడి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టలేదని, ప్రాజెక్ట్ ను పక్కన పెట్టామని సీఎంలు కూడా చెప్పలేదన్నారు.


ప్రతి పేజీలో మంచి పనులు నమోదు కావాలి


టీయుడబ్యుజె మిడియా డైరీ ఆవిష్కరణలో గవర్నర్


హైదరాబాద్, జనవరి 1: డైరీలోని ప్రతి పేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు,  విజయాలు నమోదయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలి సై సౌందర్ రాజన్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రూపొందించిన మీడియా , డైరి-2020 ని బుధవారం నాడు రాజ్ భవన్ లో తన భర్త డాక్టర్ సౌందర్ రాజన్ తో కలిసి ఆవిష్కరించారు.టీయుడబ్ల్యుజె డైరీలో నమోదైన ప్రింట్, ఎలక్ట్రాన్రిక్ మీడియా, ప్రభుత్వ సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, ఎపి ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె అధ్యక, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె. విరాహత్ అలీ, పిసిఐ సభ్యులు పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, ఎం.ఏ.మాజీద్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు దారలు మన ఉపాధ్యక్షులు దొంతు రమేష్, కోశాధికారి కె.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, యాదగిరి, అయిలు రమేష్, హెచ్.యు.జె. అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పుష్పగుచ్చాలకు బదులు తనకు పుస్తకాలు బహుకరిం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పుష్పగుఛ్చాలకు బదులు తనకు పుస్తకాలు బహుకరించాలని గవర్నర్ తమిలి సై ఇచ్చిన పిలుపుపై స్పందించిన టీయుడబ్ల్యుజె, డైరీ ఆవిష్కరణ సందర్భంలో ఆమెకు పుస్తకాలను బహుకరింcharu. 


Ummadi Zilla Projectlapy Pratyeka Dhrushti


నిర్మల్,జనవరి1 నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతాంగానికి సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టి పెట్టారు. పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. సాగునీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు, నిర్మాణ పనులు చేపడుతున్న ఏజెన్సీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి.. రైతాంగానికి - సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇటీవల సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల పర్యటనలను ఈ విషయం స్పష్టం అయ్యింది. నిర్మల్ జిల్లాలో గోదావరి ఆధారితంగా సదర్మట్ అయ్యింది. బ్యారేజ్, కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 పనులు ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగపై చనాక - కోరట బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనులతో నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు ప్రస్తుతం చేపడుతున్నారు. ప్యాకేజీ-27 ద్వారా నిర్మల్ నియోజకవర్గం లో 99 గ్రామాల్లో 50వేల ఎకరాలు, 28వ ప్యాకేజీ ద్వారా ముథోల్ నియోజకవర్గంలో 54 గ్రామాల్లో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రూ.714కోట్లతో చేపట్టిన ప్యాకేజీ - 27కు రూ.448 కోట్లు ఖర్చు చేసి 66శాతం పనులు, రూ.486.67 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ-28కు రూ.235.35కోట్లు వెచ్చించి 50శాతం పను లు పూర్తి చేశారు. మామడ మండలం పొన్కల్ వద్ద రూ.412కోట్లతో సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టగా.. ఇది పూర్తయితే 18వేల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ పై చనాక కోరట బ్యారేజీని రూ.324కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం, పంపుహౌస్ పనులు పూర్తవుతుండగా.. 24 గేట్లకు గాను 18గేట్లను అమర్చారు. ఈ బ్యారేజీ నుంచి 52వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి.. సదర్మట్, చనాక- కోరట బ్యారేజీ పనులను స్వయంగా పరిశీలిస్తారు. ప్రాజెక్టుల పనుల తీరును పరిశీలించడంతో పాటు ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు అధికారుల సమీక్ష తర్వాత సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్ కు అందించారు.


మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాంఆదిలాబాద్ పీఠం కైవసం చేసుకుంటాం: జోగు


 ఆదిలాబాద్, జనవరి1 రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ సత్తా.. గెలిచే దమ్మూధైర్యం లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తామన్నారు. పట్టణంలో 49 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి టీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో 49 వార్డుల కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించి సిఎం కెసిఆర్‌కు కానుకగా అందజేద్దామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొట్ల కోట్ల రూపాయాలతో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ కు శ్రీరామ రక్ష అని తెలిపారు. కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పట్టణ ప్రజలు తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.


 మాలావత్ పూర్ణ మరో రికార్డు


హైద్రాబాద్, జనవరం 1 నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పాకల గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ మరో రికార్డు సృష్టించింది. ఈ నెల 26న అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని ఆమె అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో విన్సన్ మాసిఫ్ ఒకటి. దీని ఎత్తు 16,050 అడుగులు. ఏడు ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది పూర్ణ లక్ష్యం. 2014లో 13 ఏండ్లలోనే ప్రపంచంలోని అత్యతం ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 2016లో ఆఫ్రికాలోని కిలిమంజారో, 2017లో యూరప్లోని ఎల్ బ్రస్, ఒసియానియా రీజియన్లోని కార్ట్ స్నేజ్ పర్వతాలను అధిరోహించింది. తన లక్ష్యంలో భాగంగా ప్రపంచంలోని మరో ఎత్తయిన పర్వతం ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వతాన్ని అధిరోహిస్తానని పూర్ణ తెలిపింది. మారుమూల ప్రాంతంలో జన్మించిన పూర్ణ.. దేశం గర్వించే స్థాయిలో నిలిచి, పాకాల గ్రామాన్ని ప్రపంచంలో నిలిపిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే తాను ఇన్ని పర్వతాలు అధిరోహించానని మాలావత్ పూర్ణ తెలిపారు. పాకాల గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో దేవిదాస్, లక్ష్మి దంపతులకు జన్మించిన పూర్ణ.. థమిక విద్యాభ్యాసం అంత సాంఘిక సంక్షేమ పాఠశాలలో పూర్తి చేసింది. అక్కడే ఆమెకు పర్వతారోహణ శిక్షణ మొదలైంది. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో భువనగిరిలో మొదలైన శిక్షణ.. లడక్, డార్జిలింగ్, మైట్రినా వరకు సాగింది.


ఏపీలో కిలో ఉల్లిని రూ.15లకే అందుbaటులోకి 


అమరావతి, జనవరి1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కిలో ఉల్లిని రూ.15లకే అందుబ టులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజుల నుంచీ ఉల్లి ధరలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. ఉల్లి ధరలు ఇంకా సామాన్యులకు అందుబాటులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రైతుల నుంచి ఉల్లిని సేకరించి రాష్ట్రంలోని 101 రైతు బజార్లలో ఈ రోజు నుంచి కిలో రూ.15కే పంపిణీ చేయనుంది. కడప ఉల్లికి కిలోకు రూ. 50 నుంచి రూ.60లు ప్రభుత్వం చెల్లించనుంది. కాగా.. రోజుకు 50 నుంచి 60 టన్నుల ఉల్లిని మార్కెటింగ్ శాఖ తెప్పించనుంది. వీటిని కిలో రూ.15కే వినియోగదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 130 రైతుబజార్లు ఉండగా, పెద్ద యార్డుల్లో మాత్రమే రాయితీ ఉల్లిని పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఈజిప్టు, టర్కీ నుంచి కేంద్రం దిగుమతి చేసుకున్న ఉల్లి మాత్రం రాష్ట్రానికి వస్తే.. కిలో రూ.25ల చొప్పునే సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. 


పలె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాలి


సర్పంచ్ లు బాధ్యతతో ముందుకు సాగాలి


జనగామ, జనవరి1: పలె ప్రగతి కోసం చేపట్టిన ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంకావాలని జెడ్పీ చైర్మన్ పాగాల సంపండి పిలుపునిచ్చారు. గ్రామాలు బాగు పడాలంటే ప్రణాళిక మేరకు ముందుకు సాగాల్సి ఉందన్నారు. రెండో విడత ప్రణాళికలో ముందుండి జనగామ జిల్లా పేరును నిలబెట్టే ప్రయత్నం చేయాలన్నారు. అధికారులు సర్పంచులను సమన్వయం చేసుకుని పారిశధ్వం, వైకుంఠధామాల నిర్మాణం తదితర కార్యక్రమాలు సాగుతాయని అన్నారు. చెట్లను పెంచినట్లయితే సకాలంలో వర్షాలు కురుస్తాయని, రైతుల భూముల్లో ఫాంపాండలు, ఇంకుడుగుంతలు తప్పని సరిగా నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసిన 30రోజుల కార్యక్రమంలో గ్రామంలోని పారుశుధ్యం, నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కరువు జిలా పేరును తీసేయాలని అందుకు తక్కువ నీటితో ఎక్కువ పంటలు మందిని రెతులను కోరారు. జనగామ జిల్లాలో ప్రతీ వర్షపు నీటి బొటు వృధాగా పోకుండా భూగర్భంలో ఇంకేలా ఒడిసిపట్టే బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యం తో ఉద్యమంలో చేపటాలని జెడ్పీ చైర్మన్ పాగాలపిలుపునిచ్చారు. తీవ్ర నీటి ఎద్దడితో అలాడే ఎగువ ప్రాంతాన్ని కేంద్రం జలశక్తి అభియాన్ కింద ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి కరువు, దుర్భిక్ష పరిస్థితులు దేశం గుర్తించిందని, అయితే అధికారులు, ప్రజల నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఇప్పటికే నీటి సంరకణ కోసం జిల్లాలో రూ.2కోట్లు చేశామని అన్నారు. భూగర్భంలో జలసంపద అడుగంటి పోవడానికి ప్రధాన కారణం అడవుల శాతం తగ్గిపోయి వర్షాలు సమృద్ధిగా కురియక పోవడం అన్నారు. లభ్యమవుతున్న నీటిని పొదుపుగా వాడుకుంటూ వర్షం కురిసిన సమయంలో ప్రతీ చుక్కను కాపాడుకుంటే తప్ప భవిష్యత్ న్యూ ఇయర్ వేడుకల్లో ఉండదన్నారు. నీటి సంరకణ పనులు చేపట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునదని అందుకే వరుణుడు కరుణించినప్పుడే ఒడిసిపటుకునే చర్యలను ప్రారంబించాలన్నారు. ఒకపకు ఉన్న నీటిని కాపాడుకుంటూ మరోపక్క వర్షపునీరు వృధాగా పోకుండా సంరకించుకునే దిశగా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజల బారసామంతో ముందుకు సాగాలని కోరారు. పంటలకు కోతుల వల వనపం వాటిలుతుందను దహ, కేంద్ర ప్రభుత్వం కోతుల బెడద నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలిన అవసరం అందరు వ్యవసాయం ప్రదాన వృతిగా జీవించే రైతులకు మరింత అండగా నిలిచేందుకు ఉపాధి హామీ పథకాన్ని సమయం అనుబందంగా మరిన్ని పనులకు అనుసంధానం చేయాలని కోరారు. నీటిని వథా చేయకుండా వేసేజీ వాటర్‌ను సెతం సది"నియోగం చేసుకునేలా అధికారుల సూచనలు పాటించి రాబోయే తరాలకు కానుక ఇవ్వాలన్నారు. కరువు జిల్లా అని ఇక్కడి వారందరికి తెలుసు కరువును పారదోలడానికి విరివిగా చెట్లను టి వాననీటిని ఒడిసిపటాలన్నారు. అందుకు సీఎం కేసీఆర్ ప్రతిపాతకంగా తీసుకోని కాలేశ్వరంలో నీటిని ఒడిసిపట్టినట్లు ప్రజలు వాన నీటిని ఒడిసిపట్టి నీటి నిల్వలను పెంపొందించు కోవాలన్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకుని ప్రతీ నీటి బొట్టు బయటకు పోకుండా భూమిలోపలికి పోయేటట్లు చేసుకోవాలని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు సహకరించాలన్నారు. 


 ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం


ఖమ్మం,జనవరి1 : తన ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం సిద్దారంలో చోటుచేసుకుంది. కొడుకు, ఇద్దరు కుమార్తెలతో సహా మహిళ గుళికలమందు తాగి కార్యక్రమం ఆత్మహత్యాయత్నం చేసింది. నలుగురిని సత్తుపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణంగా సమాచారం. ఇదిలావుంటే వరంగల్ రూరల్ జిల్లాలోని రేగొండ మండలం వెంకటేశ్వరపల్లిలో , దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్య కట్టుకున్న భర్త గొడ్డలితో నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా స్థానికులు పేర్కొన్నారు. మృతిచెందిన భార్య సుమలత, భర్త సంపతి పరకాల మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులుగా సమాచారం. 


న్యూ ఇయర్ జోష్ లో మెట్రోలో పెరిగిన ప్రయాణికులు


హైదరాబాద్, జనవరి1: నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ కొనసాగింది. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 నాడు అర్థరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వేడుకల వేళ గడిచిన అరరాత్రి 2 గంటల వరకు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. రద్దీ దృష్ట్యా నూతన సంవత్సర మెట్రో రైళ్లు నడిపారు. మెట్రో రైళ్లలో రాత్రి 4.60 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు.


 న్యూ ఇయర్ కు మద్యంకిక్కు 


హైదరాబాద్, జనవరి1: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో సగటున రోజుకు రూ.60 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగగా.. గత రెండ్రోజుల్లో ఒక్కోరోజు దాదాపు అమ్మవారిని రూ.200 కోట్ల మద్యం విక్రయాలు చోటుచేసుకున్నాయి. , డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.380 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన రెండు రోజుల్లో 4.85 లక్షల కేసుల లిక్కర్, 5.10 లక్షల కేసుల బీర మాజీసిఎం విక్రయాలు చోటుచేసుకున్నాయి.


గవర్నర్‌ను కలసిని ప్రముఖులు 


హైదరాబాద్ జనవరి1 గవర్నర్‌ తమిళిసై సౌందరరాజనను నూతనంగా నియామకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిశారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా గవర్నర్‌ను సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకమైన విషయం విదితమే. ఇప్పటి వరకు సీఎన్గా విధులు నిర్వర్తించిన శైలేంద్ర కుమార్ జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియామకం అయ్యారు. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకపు ఉ తరులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం సంతకంచేశారు. 2023 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో సోమేశ్ కుమార్ కొనసాగనున్నారు. ఇకపతోఏ కొత్త సంవత్సారన్ని పురస్కరించుకుని పలువురు మంత్రులు కూడా కలిశారు. సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులుకలసి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం తదతరులు కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


 సిఎంను కలసి శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు


 హైదరాబాద్, జనవరి1 : నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన వీరు కెసిఆర్‌కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జెన్నో ట్రాన్సకో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులకు అందించే మోడల్ డిక్షనరీని సీఎం కేసీఆర్కు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి అందజేశారు. అలాగే ఐనవోలు దేవాలయం, యాదాద్రి దేవాలయ క్యాలండర్లను సీఎం ఆవిష్కరించారు.


చంద్రయాన్--3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం


 బెంగళూరు, జనవరి1: చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం దక్కిందని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్-3 ప్రాజెక్టు పక్రియ కొనసాగుతోందన్నారు. రెండవ అంతరిక్ష కేంద్రం కోసం భూసేకరణ జరుగుతోందని, తమిళనాడులోని తూత్తుకుడిలో స్పేస్పోర్ట్ ఉంటుందని శివన్ చెప్పారు. చంద్రయాన్-2తో ఎంతో మంచి ప్రగతి సాధించామన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగలేకపోయినా.. ఆర్బిటార్ మాత్రం చురుగ్గా పనిచేస్తున్నదన్నారు. చంద్రుడి డేటాను మరో ఏడేళ్ల పాటు ఆ ఆర్బిటార్ అందివ్వనున్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఈ ఏడాది గగన్యోన్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టులను ఆయన వివరించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం వ్యామగాముల ఎంపిక పూర్తి అయ్యిందని, భారత వైమానిక దళం నుంచి నలుగుర్ని ఎంపికయ్యారని, వారంతా రష్యాలో జనవరి మూడవ వారం నుంచి శిక్షణ తీసుకోనున్నట్లు చెప్పారు. శ్రీహరికోటలో పబ్లిక్ వ్యూవింగ్ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు.